'నిధుల కేటాయింపులో జాప్యం ఎందుకు'
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పంచాయతీలకు మంజూరైన నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రెడ్డివారిపల్లి పంచాయతీ పరిధిలోని బాటమాదిగపల్లెలో మహిళలతో కలిసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.