VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
SRD: నాగారం మండల కేంద్రంలో ఇవాళ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 3.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన తహసీల్దార్ కార్యాలయంతో పాటు, మండల ప్రజా పరిషత్ (MPP) భవనం, నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.