మెగా మెడిక‌ల్ క్యాంప్‌న‌కు విశేష స్పంద‌న‌

మెగా మెడిక‌ల్ క్యాంప్‌న‌కు విశేష స్పంద‌న‌

ASR: అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం చైర్మన్ పద్మనాభ రాజు మాట్లాడుతూ.. వైద్యం ఖరీదైన నేపథ్యంలో సామాన్య ప్రజలకు అండగా నిలవడానికి ఈ కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, ఈసీజీ, కంటి, పంటి పరీక్షలతో పాటు క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.