జూన్ 4న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

HYD: GHMC సర్వసభ్య సమావేశాన్ని జూన్ 4న నిర్వహించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ నిర్ణయించారు. పాలకమండలి గడువు 2026 ఫిబ్రవరితో ముగియనుండటంతో కార్పొరేటర్ల నుంచి అందిన ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేస్తున్నారు. పారిశుద్ధ్యం, నాలాలు, SNDPపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు మరో సమావేశం జరిగే అవకాశం ఉందన్నారు.