'పాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
KDP: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాజంపేట TDP ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. గురువారం సిద్ధవటం(మం) మూలపల్లెలో నూతనంగా నిర్మించిన 4 'గోకులం' షెడ్లను ఆయన ప్రారంభించారు. పశువుల ఆరోగ్యం, పాల దిగుబడి పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోకులం షెడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చమర్తి కొనియాడారు.