బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి: సీపీ
WGL: బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్ విభాగంలో ఏఆర్ ఎస్సైలుగా పదోన్నతి పొందిన మల్లారెడ్డి, బీరదేవ్, సయ్యద్ సాదత్ అలీలు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అప్పగించిన పనులను సమర్ధవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు.