ధనుర్మాసం ప్రారంభంతో గంగిరెద్దుల సందడి
KKD: ధనుర్మాసం ప్రారంభం కావడంతో పిఠాపురంలో సంక్రాంతి సందడి మొదలైంది. రంగురంగుల వస్త్రాలతో అలంకరించిన గంగిరెద్దులు, డప్పు వాయిద్యాల నడుమ పిఠాపురం, గొల్లప్రోలు వీధుల్లో కనువిందు చేస్తున్నాయి. గంగిరెద్దుల వారు ఇంటింటికీ తిరుగుతూ భక్తులు ఇచ్చే బియ్యం, వస్త్రాలు, పండ్లులను స్వీకరిస్తూ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఈ దృశ్యాలతో తెలుగువారి లోగిళ్లలో పండగ మొదలైంది.