పాలకుర్తి బస్టాండుకు మైక్ సెట్ అందించిన గంటా రవీందర్

JN: మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంటా రవీందర్ పాలకుర్తి కేంద్రంలోని బస్టాండ్‌కు మైక్ సెట్ అందజేశారు. ప్రయాణికులకు బస్సు వేళలు, బస్సులు ఎటువైపు వెళ్లనున్నాయో తెలియజేయడానికి మైక్ సెట్ అవసరమని కంట్రోలర్ కోరగానే, వెంటనే మైక్ సెట్ అందజేశారు. నెల క్రితం చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి, ఐదు ఫ్యాన్లు, ట్యూబులు, అలాగే ప్రయాణికులు కూర్చోవడానికి 8 బెంచీలు అందజేశారు.