బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఎక్కడ: అనంత వెంకటరామిరెడ్డి

ATP: 2025-2026 వార్షిక బడ్జెట్ అంతా అంకెల గారడి అని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మరోసారి చంద్రబాబు తన మోసపూరిత నైజాన్ని చాటుకుంటూ సూపర్‌సిక్స్ హామీలకు ఎగనామం పెట్టారని విమర్శించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామని చెబుతూనే బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం అరకొరగా చేశారన్నారు.