‘ఏఐ వచ్చినా ఆ జాబ్స్ సేఫ్’
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) వచ్చినా కొన్ని ఉద్యోగాలకు ఢోకా లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ముఖ్యంగా ప్లంబర్ల లాంటి పనులకు ఏఐతో ముప్పు లేదన్నారు. అయితే ఇలాంటి పనులు చేసేవాళ్లు దొరకట్లేదని, ఆ ఖాళీలను భర్తీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, స్కిల్స్ పెంచాలని సూచించారు.