'బాధితునికి మెరుగైన వైద్యం అందించాలి'
ADB: బేల మండలంలోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన కోడె ఉత్తంకు ప్రమాదవశాత్తు చెట్లు కోసే మిషన్ తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ సందర్భంగా పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి శనివారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని కోరారు.