కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ ఫైర్
AP: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. మహిళా బిల్లు కేవలం ఎన్నికల స్టంటే అని విమర్శించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసమే పార్లమెంట్‌లో బీజేపీ డ్రామాలు ఆడిందని ఆరోపించారు. డీలిమిటేషన్ పేరుతో మహిళలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు.