BREAKING: అసెంబ్లీలో తీవ్ర గందరగోళం
TG: అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేల నిరసనతో తీవ్ర గందరగోళం నెలకొంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సభలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ప్రభుత్వం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లు, న్యాయవాదుల రక్షణ బిల్లులకు ఆమోదం తెలిపింది.