'వ్యవసాయ పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలి'

BHPL: టేకుమట్ల మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏవో కళ్యాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మండలానికి 103 రకాల వ్యవసాయ పనిముట్లను కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు.