VIDEO: ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి
HYD: రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ప్రజలు ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణించడం వల్ల పర్యావరణం సురక్షితంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, నగర మేయర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.