VIDEO: పగిలిన గ్యాస్ పైప్ లైన్

MDCL: మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ వెళ్లే దారిలో శనివారం విద్యుత్ స్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో స్తంభం పక్కనే ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్‌కు తగలడంతో అది పగిలిపోయింది. దీంతో భూమిలో నుంచి గ్యాస్ ఎగసిపడి ఆ ప్రాంతంలో తీవ్రమైన వాసన వ్యాపించింది. స్థానికులు వెంటనే గ్యాస్ కంపెనీకి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని మరమ్మతులు చేశారు.