రోడ్డు విస్తరణ బాధితులకు ఊరట

రోడ్డు విస్తరణ బాధితులకు ఊరట

విశాఖ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందజేస్తామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం పెందుర్తిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి, వేపగుంట–పినగాడి రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన 37 మంది బాధితులకు సుమారు రూ.30.5 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.