పెళ్లింట విషాదం

SDPT: చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లో విద్యుత్ షాక్ తగిలి తండ్రీకొడుకులు మృతిచెందిన విషయం తెలిసిందే. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితమే గజేందర్ రెడ్డి తన కూతురు పెళ్లి ఘనంగా చేశాడని, ఇంతలోనే విషాదం జరిగిందన్నారు. కాగా, కరెంట్ షాక్ తగిలి మూర్తి గజేందర్ రెడ్డి (60), ఆయన కొడుకు మూర్తి విజేందర్ రెడ్డి(27) చనిపోవడంతో కుటుంబీకులు విలపిస్తున్నారు.