రైతుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఇంఛార్జ్
KDP: పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని గోపవరం మండలంలోని పెద్ద గోపురంలో బద్వేల్ TDP ఇంఛార్జ్ రితేష్ రెడ్డి, EX ఎమ్మెల్యే విజయమ్మ నిర్వహించారు. రైతులను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా రెండో విడతగా రూ. 7 వేలు ప్రతి రైతుకు ప్రభుత్వం జమ చేసిందని అన్నారు.