VIDEO: ఈనెల 3న ర్యాలీ జగన్మోహిని ఆలయం మూసివేత
కోనసీమ: ఆత్రేయపురం మండలం చంద్రగ్రహణం కారణంగా ఈనెల 3న ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయాన్ని ఉదయం 8 గంటలకు మూసివేయనున్నట్లు ఈవో వెంకటరమణ ఆదివారం తెలిపారు. ఉదయం 8గంటలు వరకూ మాత్రమే పూజలు జరుగుతాయన్నారు. 4వ తేదీ ఉదయం సంప్రోక్షణ నిర్వహించి, 8 గంటల నుంచి భక్తులకు దర్శనాలు పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించాలని కోరారు.