ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

KRNL: కోడుమూరు మండలం వెంకటగిరి రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కోడుమూరు నుండి వెల్దుర్తికి ప్రయాణిస్తున్న బస్సులో గేర్ రాడ్ విరిగిపోవడంతో నియంత్రణ కోల్పోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. డోన్ డిపోకు చెందిన ఏపీ 29 జడ్ 1827 బస్సులో 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.