ఓటరు జాబితా ప్రదర్శన
VKB: పంచాయతీ ఎన్నికల సమరానికి అధికారులు సన్నద్ధమయ్యారు. కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికల ఓటర్ల జాబితాలను సూపరింటెండెంట్ బాలకృష్ణారెడ్డి, ఎంపీవో జైపాల్ రెడ్డి ప్రదర్శించారు. ఓటరు జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, పేర్లు లేకపోయినా.. మండల పరిషత్ కార్యాలయాల్లో లేదా గ్రామ పంచాయతీల్లోని కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.