పెనుకొండలో ప్లాస్టిక్ వస్తువులు సీజ్

పెనుకొండలో ప్లాస్టిక్ వస్తువులు సీజ్

సత్యసాయి: పెనుకొండ పట్టణంలో పలు దుకాణాలను మున్సిపల్ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. నగర పంచాయతీ కమీషనర్ సతీశ్ కుమార్ పట్టణంలోని వాణిజ్య దుకాణాలు, హోటల్స్‌లో దాడులు చేసి 90 కేజీల ప్లాస్టిక్‌ను సీజ్ చేశారు. అలాగే 1500 రూపాయలు అపరాద రుసుము విధించారు. ఇకపైన ఇలాంటివి పునరావృతం అయితే షాపుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.