VIDEO: ప్రేమ వేధింపులు.. బాలిక ఆత్మహత్య
KMM: కల్లూరు మండలం పేరువంచకు చెందిన బాలిక ప్రేమ పేరిట ఎదురవుతున్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన తురక అనిల్ కొన్నాళ్లుగా ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధిస్తుండడమే కాక అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె గత రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.