విద్యుత్ షాక్తో యువకుడి మృతి
SRPT: వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతిచెందిన ఘటన మోతే మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుడు చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టిపల్లి సాయి సందీప్(22). ఇతడు మోతే లోని ఓ ఫర్టిలైజర్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, సందీప్ మృతితో గుంపుల తిరుమలగిరి లో విషాదఛాయలు అలుముకున్నాయి.