పులి అడుగులంటూ ప్రచారం.. క్లారిటీ

పులి అడుగులంటూ ప్రచారం.. క్లారిటీ

WGL: దుగ్గొండి మండలం తొగరు రామయ్య పల్లి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు స్థానికంగా కలకలం రేపింది. ఓ రైతు మొక్కజొన్న చేనులో పులి పాదముద్రలు ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో గురువారం ఆ అడుగులను పరిశీలించారు. అవి పులి అడుగులు కాదని హైనా అడుగులుగా గుర్తించినట్లు తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.