ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ బదిలీ

ADB: రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను స్థానచలనం కల్పిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ మున్సిపల్ ఎండి ఖమర్ అహ్మద్ సైతం బదిలీ అయ్యారు. ఆయనను నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేయగా అక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న రాజును ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.