నూతన బోర్ మోటార్ ప్రారంభం
MBNR: బాలానగర్ మండలంలోని కుమ్మరి కుంట తండాలో రెండు రోజులుగా శ్రీ హనుమాన్ దీపస్తంభం గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతన బోర్ మోటార్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ నాయక్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.