జుక్కల్‌లో 10 నామినేషన్ సెంటర్లు ఏర్పాటు
KMR: జుక్కల్ మండలంలోని 30 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మొత్తం 10 నామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఇట్టి సమాచారాన్ని గ్రామాల్లో దండోరా వేయిస్తారని పేర్కొన్నారు. 30 సర్పంచ్ స్థానాలు, 270 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు 10 సెంటర్లలో వేస్తారని పేర్కొన్నారు.