బాలయ్య తరఫున CMకు రూ.50 లక్షల చెక్కు

బాలయ్య తరఫున CMకు రూ.50 లక్షల చెక్కు

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల రైతులకు అండగా నిలిచేందుకు CMRFకు నందమూరి బాలయ్య రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విరాళం చెక్కును ఆయన తరఫున చిన్న కూతురు తేజస్విని CM రేవంత్‌కు అందజేశారు. ఇటీవల విరాళం ప్రకటించిన సందర్భంగా భవిష్యత్‌లోనూ తన వంతుగా సహాయాలు చేస్తానని బాలయ్య పేర్కొన్నారు.