గొలుగొండలో గంజాయి రవాణా.. వ్యక్తి అరెస్ట్

గొలుగొండలో గంజాయి రవాణా.. వ్యక్తి అరెస్ట్

AKP: 10 కేజీల గంజాయితో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు గొలుగొండ ఎస్సై పీ.రామారావు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు శనివారం మండలంలోని చిన్నయ్యపాలెం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడిందన్నారు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ బౌరావ్ గోరేను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై చెప్పారు.