భారీ వర్షంతో కాన్వెంట్ జంక్షన్ జలమయం

విశాఖపట్నంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా కాన్వెంట్ జంక్షన్ వద్ద రహదారి మొత్తం నీటితో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.