తుఫాన్ బాధితులకు నగదు పంపిణీ
VZM: ఎల్.కోట మండల కేంద్రంలో ఇటీవల తుఫాన్ ప్రభావిత బాధిత కుటుంబాలకు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బాధితులకు నగదు పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీపై ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తహసిల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.