ఇంటర్ ఫస్టియర్‌లో దరఖాస్తులు స్వీకరణ

SRD: పుల్కల్ మండలం బస్వాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్‌లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణ చక్రవర్తి మంగళవారం తెలిపారు. మే 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 26న కళాశాల నోటీసు బోర్డుపై ప్రకటిస్తామన్నారు. మే 31వ తేదీ వరకు ప్రవేశ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.