పెదగంట్యాడ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ
VSP: ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పెదగంట్యాడ శాఖా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారిని కలిసి అక్కడ ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రంథాలయ అధికారికి సూచించారు.