క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి

క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి

ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. నెల రోజుల నుంచి ఈ వ్యవహారంపై దృష్టి పెట్టామని, పైలట్లు, సిబ్బంది కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. ఇలాంటి సమస్యలు భవిష్యత్‌లో రిపీట్ చేయొద్దని ఇండిగోకు గట్టి వార్నింగ్ ఇచ్చామని చెప్పారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.