100 మొక్కలు నాటిన విద్యుత్ సిబ్బంది

100 మొక్కలు నాటిన విద్యుత్ సిబ్బంది

NRML: దిలావర్పూర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో గురువారం హరితహారం నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యుత్ అధికారులు 100 మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కకు నీరు అందించి కాపాడుకోవాలని మండల విద్యుత్ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్‌మెన్ సంతోష్, అసిస్టెంట్ లైన్‌మెన్ తిరుపతి, అఖిల్, రాజ్ కుమార్, ఆపరేటర్ భీమన్న, తదితరులు పాల్గొన్నారు.