బాధిత మహిళను పరామర్శించిన MLA
ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలానికి చెందిన ఎల్కరి స్రవంతి అనే మహిళ అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆదివారం MLA హరీష్ బాబు పరామర్శించారు. ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి మహిళ ఆరోగ్య పరిస్థితి గురించి MLA తెలుసుకున్నారు. సదరు మహిళకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.