సంకిస గ్రామంలో ఇందిరమ్మ పల్లె బాట యాత్ర

సంకిస గ్రామంలో ఇందిరమ్మ పల్లె బాట యాత్ర

MHBD: డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకిస గ్రామంలో శనివారం ఇందిరమ్మ పల్లె బాట యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా. జటోత్ రామచంద్రనాయక్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు డా.బత్తుల శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఈ యాత్ర సాగింది. పనుల జాతరపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాసం శేఖర్, తేజావత్ వెంకన్న, కళావతి పాల్గొన్నారు.