ఘనంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం

ఘనంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం

AKP: నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కార్యక్రమం ఘనంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ఈ పథకం మూడవ విడత నిధుల పంపిణీని స్థానికంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.