VIRAL VIDEO: పెళ్లి కూతురు బైక్ స్టంట్
పెళ్లి దుస్తులు ధరించిన ఓ యువతి హైవేపై బైక్ నడిపిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆమె అసలు పెళ్లి కూతురు కాదని, రీల్స్ కోసమే వధువు మేకోవర్ వేసుకుని సూపర్ బైక్‌పై స్టంట్లు చేస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు రోడ్లపై ఇలా రీల్స్ కోసం రిస్క్ తీసుకోవడం సరైంది కాదని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.