గుర్తు తెలియని వాహనం ఢీ.. ఇద్దరు మృతి

NGKL: జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకొండ నుంచి చారకొండ మధ్యలో ఎర్రగుంటపల్లి వద్ద బైక్ పై వస్తున్న ఇద్దరిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించారు. మృతులు కార్తీక్ చారి సబ్ స్టేషన్‌లో పనిచేస్తుండగా, అరవింద్ చారి బస్టాప్ వెనుక మీల్స్ హోటల్ నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు.