'గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి'

'గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి'

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న గోదావరి పుష్కర ఘాట్ ప్రాంతాన్ని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తొ కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలలో భాగంగా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్నారు.