SKU పరిధిలో నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
ATP: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU) పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో నేటి నుంచి 19 వరకు 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 54 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు జీవీ రమణ తెలిపారు. 15 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.