వడ్డీ లేని రుణాల పంపిణీ ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు
MNCL: మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించనున్నట్లు డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి అనసూయ, రాష్ట్ర CS రామకృష్ణారావు, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. వడ్డీ లేని రుణ పథకంలో భాగంగా రూ.304 కోట్లు విడుదల చేశామన్నారు.