వినాయక మట్టి విగ్రహాలను పూజించాలి: ఇన్‌ఛార్జ్ DRO

కోనసీమ: వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాలుష్య రహితమైన మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే పూజించేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ DRO మాధవి సూచించారు. శనివారం సాయంత్రం AMP ఆర్డీఓ కార్యాలయం వద్ద జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఆదేశాలిచ్చారు.