ఉపాధి హామీ కూలీలకు ఎండల పట్ల అవగాహన

ఉపాధి హామీ కూలీలకు ఎండల పట్ల అవగాహన

BDK: ప్రస్తుతం భానుడు నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో, పనులకు వెళ్లే ఉపాధి హామీ కూలీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో ముత్యాలరావు సూచించారు. గురువారం అశ్వాపురం మండలం ఎలకలగూడెం గ్రామపంచాయతీలో ఎంపీడీవో, సర్పంచ్ కలేటి నాగమణి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.