రోడ్డు ప్రమాదంలో.. యువకుడు దుర్మరణం
NLR: కందుకూరు మండలం ఓగూరు గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గాజుల దుర్గేష్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన డమ్ములను బైక్‌తో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.