సురవరం సుధాకర్ రెడ్ది మృతికి సంతాపం తెలిపిన ఎంపీ

సురవరం సుధాకర్ రెడ్ది మృతికి సంతాపం తెలిపిన ఎంపీ

KRNL: సీపీఐ పార్టీ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై శనివారం కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు సంతాపం తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగి, ప్రజా నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసి దేశ రాజకీయాల్లో నిలబడ్డారని ఆయన కొనియాడారు. ఆయన మృతి చాలా బాధాకరమని, ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని ఎంపీ నాగరాజు అన్నారు.