శేష వాహనంపై అగస్తేశ్వర స్వామి దర్శనం

శేష వాహనంపై అగస్తేశ్వర స్వామి దర్శనం

TPT: నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో టీటీడీ శ్రీమరకతవల్లి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులు ఆదివారం రాత్రి శేష వాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగించారు.